![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -635 లో....రాజ్, కావ్య అమెరికాకి వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంటున్నారని రుద్రాణి ధాన్యలక్ష్మిలు ఇంట్లో గొడవ మొదలుపెడతారు. ఇదంతా ఎందుకు వాళ్ళు ఇంటికి వస్తారు కదా అప్పుడు అడుగుదామని వాళ్ళకి సమాధానం చెప్తుంది అపర్ణ. మరోవైపు రాజ్, కావ్యల దగ్గరికి వాళ్ళ డిజైన్ కొన్న అతను వస్తాడు. వచ్చి రెండు కోట్లు క్యాష్ ఇస్తాడు. మాకు ట్రాన్స్ఫర్ చెయ్యండి అని రాజ్ అనగానే.. ఇప్పుడు వీలవదు అర్ధం చేసుకోండి అని అతను అనగానే.. సరే అని క్యాష్ తీసుకుంటాడు.
ఎప్పుడెప్పుడు రాజ్ , కావ్య వస్తారా నిలదియ్యాలంటూ రుద్రాణి, ధాన్యలక్ష్మి ఇద్దరు వెయిట్ చేస్తుంటారు. అప్పుడే స్వప్న వచ్చి వాళ్ళకి చురకలు అంటించినట్లు మాట్లాడుతంటుంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఏంటి ఆ మాటలు అని స్వప్నపై ధాన్యలక్ష్మి కోప్పడుతుంది. కోడలిని భయంలో పెట్టుకోలేదని రుద్రాణితో ధాన్యలక్ష్మి అనగానే.. నీ కోడలు దూరంగా ఉంది కాబట్టి నువ్వు ఇలానే మాట్లాడుతావని రుద్రాణి అంటుంది. మరోవైపు అప్పుకి కళ్యాణ్ ఫోన్ చేసి.. ప్రొడ్యూసర్ తనని మెచ్చుకున్నాడన్న విషయం చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు.
అందరు భోజనం చేస్తుంటారు. రాజ్, కావ్య వస్తారు. ఎందుకు డబ్బు అంత డాలర్ లాగా మార్చాలనుకుంటున్నావు.. రుద్రాణి, ధాన్యలక్ష్మిల ఆస్తులు అమ్మి ఎందుకు అలా చేస్తున్నావని అపర్ణ అందరి ముందు అంటుంది. నేను ఆస్తులు అమ్మడం ఏంటి? డాలర్ లోకి మార్చడం ఏంటని రాజ్ అంటాడు. మరి ఎందుకు అమెరికా వెళ్ళాలనుకుంటున్నారు.. వీసా ఎందుకు తీస్తున్నారని రుద్రాణి అడుగుతుంది. అక్కడ క్లయింట్ కి మన డిజైన్స్ నచ్చాయి.. వచ్చి డెమో ఇమ్మన్నారు.. అందుకే వెళ్తున్నామంటూ రాజ్ కోప్పడి వెళ్తాడు. మరి ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బు అంతా ఏం చేస్తున్నారని రుద్రాణి, రాహుల్ లు అనుకుంటారు. ఆ తర్వాత రాజ్ కావ్య తమ గదిలో క్లయింట్ ఇచ్చిన డబ్బు లెక్కపెడుతుంటారు. తరువాయి భాగంలో రాజ్, కావ్య డబ్బు లెక్కపెట్టడం రాహుల్ చూసి రుద్రాణికి చెప్తాడు. ఇప్పుడు వాళ్ళని రెడ్ హండెడ్ గా పట్టిస్తానంటు రాహుల్ కి రుద్రాణి ఏదో చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |